డొమిన్ డిసిల్వా దర్శకత్వంలో నటి సునైనా తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ మూవీకి మూవీ మేకర్స్ 'రెజీనా' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ శుక్రవారం తమిళంలో మాత్రమే ఈ సినిమా విడుదల కానుంది. విడుదలకు ముందే, ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది మరియు U/A సర్టిఫికేట్ను పొందింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ఆన్లైన్ లో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.
ఈ చిత్రంలో అనంత్ నాగ్, నివాస్ ఆదితన్ తదితరులు సహాయక పాత్రలు పోషించారు. ఎల్లో బేర్ ప్రొడక్షన్కు చెందిన సతీష్ ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీని నిర్మించారు. ఈ చిత్రానికి సతీష్ సంగీతం అందిస్తున్నారు.