టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నిత్యామీనన్ అమ్మమ్మ మృతిచెందారు. తాను ఎంతో ప్రేమించే అమ్మమ్మ చనిపోయారంటూ నిత్యామీనన్ ఇన్ స్టాలో పోస్టు పెట్టారు. 'ఒక శకం ముగిసింది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా అమ్మమ్మ. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీమ్యాన్. ఇప్పటి నుండి మరో కోణంలో చూసుకుంటా' అంటూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. తన అమ్మమ్మతో కలిసి దిగిన ఫోటోను నిత్యామీనన్ పంచుకున్నారు.