'బేబీ' చూస్తూ ఏడ్చేశా: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘బేబీ’ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై స్టార్ హీరోయిన్ రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ చిత్రం అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించింది. ‘బేబీ చిత్రాన్ని చూశాను. మూవీలో అద్భుతమైన ఎమోషనల్ పెర్ఫామెన్స్ చూసి ఏడుపు వచ్చేసింది. ప్రతి సన్నివేశం నా హృదయంలో చాలా కాలం నిలిచిపోతుంది. చిత్ర యూనిట్కి నా అభినందనలు' అంటూ రష్మిక ట్వీట్ చేసింది.