టాలీవుడ్ నటి నందితా శ్వేత ఓ వింత వ్యాధితో బాధపడుతున్నారు. వ్యాధికి సంబంధించిన లక్షణాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. తాను ఫైబ్రోమైయాల్జియా అనే కండరాల రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలిపింది. ఈ వ్యాధి కారణంగా కండరాలు, కీళ్ల నొప్పి వస్తుందని, శరీరం త్వరగా అలసిపోయేలా చేస్తుందన్నారు. జ్ఞాపకశక్తి తగ్గిస్తుందని అన్నారు. హిడింబా సినిమాలో పోలీస్ పాత్ర కోసం తాను బరువు తగ్గాల్సి వచ్చిందని, సన్నబడటం కోసం చాలా కష్టపడ్డానని ఆమె తెలిపారు.