ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘బేబీ’. పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి రాజేష్ అద్భుతంగా తెరకెక్కించాడు. విడుదలైన రెండు రోజుల్లోనే రూ.7 కోట్లు వసూళ్లు రాబట్టింది. తాజాగా దర్శకుడు సాయి రాజేష్‌కు నిర్మాత ఎస్కేఎన్ ఇచ్చిన పారితోషికం వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సాయిరాజేష్ రూ.2 కోట్ల పారితోషికం తీసుకున్నాడట. అలాగే లాభాల్లోనూ వాటా ఇస్తానని నిర్మాత మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.