టాలీవుడ్ స్టార్ హీరో సాయిధరమ్ తేజ్ సర్జరీ చేసుకోనున్నారు. ‘బ్రో’ ప్రచార కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘సినిమాలకు కొద్ది రోజులు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నాను. రాబోయే సినిమాల అప్డేట్ గురించి ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ముందుగానే ఈ విషయాన్ని చెబుతున్నాను. శారీరక ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ తీసుకుంటానని, చిన్న సర్జరీ చేయించుకుని మరింత ఆరోగ్యంగా తిరిగి వస్తాను. ఆరు నెలలపాటు సినిమాకు దూరంగా ఉంటాను.’ అని ఆయన అన్నారు.