ప్రముఖ తెలుగు రచయిత శ్రీరమణ కన్నుముశారు. పేరడి రచనలకు పేరుగాంచిన ఆయన, బాపు, రమణలతో కలిసి పనిచేశారు. ఆయన స్వస్థలం బాపట్వ జిల్లా వేమూరు మండలం వరహాపురం. వేమూరులో ఫస్ట్ ఫారమ్ చేసిన ఆయన, అనంతరం బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో పీయూసీ పూర్తిచేశారు. శ్రీకాలమ్, శ్రీచానెల్, చిలకల పందిరి, హాస్య జ్యోతి, మొగలిరేకులు వంటి శీర్షికలు ఆయన రచించారు.