టాలీవుడ్ యువ హీరో విశ్వక్సేన్ శుక్రవారం చేసిన ట్విట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ‘నో అంటే నోనే అని, ఇది పురుషులకు వర్తిస్తుంది. కాబట్టి అందరం కూల్‌గా ఉందాం. అరవడం కన్నా శాంతియుతంగా ఉందాం.’ అని అన్నారు. అయితే ఈ ట్విట్ ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియడం లేదు. ‘బేబీ’ సినిమాను ఉద్దేశించి ఈ ట్విట్ చేసి ఉంటాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోగా ముందు విశ్వక్సేన్ను అనుకున్నారట. కానీ దానికి విశ్వక్ ఒప్పుకోలేదని సమాచారం.