చిరు జల్లుల్లో పులకరిస్తుంది కృతి శెట్టి. చల్లని పవనాలు ఆస్వాదిస్తోంది. షార్ట్ ఫ్రాక్ లో కృతి శెట్టి లుక్ సూపర్ హాట్ గా ఉంది. గతంలో ఎన్నడూ చూడని రేంజ్ లో బోల్డ్నెస్ కి తెరలేపింది. వర్షంలో తడుస్తున్న బార్బీ డాల్ అంటూ తన హాట్ ఫోటోలకు కామెంట్ పెట్టింది కృతి. నిజంగా ఈ యంగ్ బ్యూటీ బార్బీని తలపించింది. కృతి కెరీర్ నెమ్మదించిన తరుణంలో గ్లామర్ డోస్ పెంచింది. కృతి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక కృతి కెరీర్ పరిశీలిస్తే... ఇటీవల జీనీ టైటిల్ తో ఒక తమిళ చిత్రం ప్రకటించింది. జయం రవి, కృతి శెట్టి జంటగా నటిస్తున్నారు. జీనీ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శి మరొక హీరోయిన్ గా నటిస్తున్నారు. మొదటి చిత్రం ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కృతి దెబ్బకు స్టార్డం తెచ్చుకుంది. ఉప్పెన విజయంలో సింహ భాగం కృతి శెట్టిదే. తన వయసుకు పాత్రలో కృతి చాలా సహజంగా అనిపించింది. చేపకళ్ళు, చొట్ట బుగ్గలకు తోడు మెస్మరైజ్ చేసే ముఖకవళికలు కుర్రకారుకు నిద్ర లేకుండా చేశాయి.
#KritiShetty pic.twitter.com/cwU9mxJs8r
— Star Gallery (@stargallery2020) July 21, 2023