తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. ఈ నెల 30న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరగనున్నాయి. తాను అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తన ప్యానెల్ సభ్యుల వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అధ్యక్ష పదవికి ఎందుకు పోటీ చేస్తున్నానన్నారు. తనకు పదవి ముఖ్యం కాదని, తెలుగు చిత్ర పరిశ్రమను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యం అని దిల్ రాజు అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన ప్యానల్ సభ్యుల వివరాలను వెల్లడిస్తూ.. తాను ఎన్నికలలో ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందో చెప్పారు.