నెపోటిజంపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిసనన్ స్పందించారు. కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆమె పేర్కొన్నారు. కృతి మాట్లాడుతూ..‘బాలీవుడ్లో నెపోటిజం ఎక్కువగా ఉంది. కెరీర్ ప్రారంభంలో కొన్ని పెద్ద సినిమాల ఆఫర్లు వచ్చినట్టే వచ్చి చేజారేవి. ఫస్ట్‌లో నన్ను హీరోయిన్గా ప్రకటించి.. సినిమా ప్రారంభమయ్యాక ఆ స్థానంలో స్టార్ కిడ్స్ను తీసుకునేవారు. ఇలాంటివి చాలా జరిగాయి. అయినా నేనేప్పుడు బాధపడలేదు.’ అని అన్నారు.