తలైవా రజనీకాంత్ నటించిన చిత్రం ‘జైలర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిటైర్డ్ జైలర్ ముత్తు పురాతన విగ్రహాల చోరీ ముఠాను ఎలా ఎదుర్కొంటాడు? కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడు అనేది స్టోరీ. రజనీ హిరోయిజం, కామెడీ, అనిరుధ్ BGM, ట్విస్టులు సినిమాకు ప్లస్ పాయింట్స్. స్క్రీన్ ప్లే, ఎలివేషన్స్ ఆకట్టుకున్నాయి. ఇతర నటి నటులు వారి పాత్రలకు న్యాయం చేశారు. చివరగా.. ప్రేక్షకులకు కడుపు నిండిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చారు సూపర్ స్టార్.
ప్లస్ పాయింట్లు: సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్‌గా అభిమానులను ఉర్రూతలూగించారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తో సూపర్ స్టార్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా రజనీ తన పాత్ర పరిస్థితులకు అనుగుణంగా వేరియేషన్స్‌ని చూపుతూ ఆకట్టుకునేలా ఉంది. అంతేకాదు, రజనీకాంత్ తన బాడీ లాంగ్వేజ్‌తో, కొన్ని యాక్షన్ మరియు ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలలో మరియు తన స్టైలిష్ లుక్‌లతో చాలా బాగా నటించాడు. అతిథి పాత్రల్లో నటించిన మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీష్రాఫ్‌లు కూడా సినిమాకు ప్లస్ అయ్యారు.
మరో కీలక పాత్రలో నటించిన సునీల్ కూడా చాలా బాగా నటించాడు. తల్లి పాత్రలో రమ్యకృష్ణ మెప్పించింది. తమన్నా స్పెషల్ సాంగ్ బాగుంది. వసంత్‌రవి, నాగబాబు, యోగిబాబుతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ప్రతి ఒక్కరూ తమ పాత్రలో ఒప్పించారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రాసుకున్న కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి.
మైనస్ పాయింట్లు: జైలర్ పాత్రని, ఆ క్యారెక్టర్ తాలూకు ఫ్లాష్ బ్యాక్ ని బాగా డిజైన్ చేసిన దర్శకుడు అదే స్థాయిలో ట్రీట్ మెంట్ రాసుకోలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జైలర్ కథ రాయలేదు. ఈ జైలర్‌లోని చాలా సన్నివేశాలు చాలా నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. నెల్సన్ తన గత చిత్రాల తరహాలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడా ఫ్రెష్‌నెస్ లేదు. అతను ఫస్ట్ హాఫ్‌ను వేగంగా నడిపించాడు, కానీ సెకండాఫ్ చాలా పొడవుగా ఉంది. ఓవరాల్ గా ఈ జైలర్ సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్ లో ఆడియన్స్ కాన్ ఫ్లిక్ట్ అయిపోతారు.. సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. సెకండాఫ్‌తో రజనీ అభిమానులు కూడా నిరాశ చెందుతారు.
రేటింగ్: 2.75 / 5.