ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా బాక్సర్ మైక్ టైసన్‌,,,,ఆయనకు మేనేజర్‌గా డొనాల్డ్ ట్రంప్

international |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 09:49 PM

ప్రపంచంలోని మేటి బాక్సింగ్ దిగ్గజాల్లో ఒకరైన మైక్ టైసన్.. మహాబలుడుగా గుర్తింపు పొందారు. ఆయన రింగ్‌లోకి దిగారంటే ప్రత్యర్థులు క్షణాల్లో తలవంచాల్సిందే. కేరీర్‌లో 50 విజయాలు సాధిస్తే.. అందులో 44 నాకౌట్ విజయాలే కావడం విశేషం. ప్రపంచంలోని 100 మంది అత్యుత్తమ బాక్సర్లలో టైసన్ 16వ స్థానంలో నిలిచారు. అయితే, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆయన వద్ద ఒకప్పుడు మేనేజర్‌గా పనిచేసిన విషయం చాలా మందికి తెలియదు. టైసన్‌కు ఆర్దిక సలహదారుతో పాటు మేనేజర్‌గానూ ట్రంప్ వ్యవహరించారు.


  తన ప్రత్యర్థి మైఖేల్ స్పింక్స్‌తో 1988లో జరిగిన బౌట్ ముగిసిన కొన్నాళ్లకే టైసన్ వద్ద ఉద్యోగంలో చేరారు. ప్రపంచ బాక్సింగ్ చరిత్రలోనే అత్యంత తక్కువ సమయం జరిగిన బౌంట్‌గా ఇది రికార్డులకెక్కింది. టైసన్ పంచ్‌లకు తాళలేక కేవలం 91 సెకెన్లలో స్పింక్స్ ఓటమిని అంగీకరించి రింగ్ నుంచి బయటకొచ్చేశారు. అట్లాంటిక్ సిటీలోని ట్రంప్ ప్లాజా హోటల్‌లోనే ఈ మ్యాచ్ జరిగింది. ఈ పోరు తర్వాత నగదు చెల్లింపుల విషయంలో విబేధాల రావడంతో తన మేనేజర్ బిల్ విలియం కేటన్‌ను టైసన్ తొలగించారు.


బాక్సింగ్ ప్రమోటర్ అయిన విలియం కేటన్.. టైసన్‌‌పై దావా వేశాడు. కానీ నాలుగేళ్ల తర్వాత రాజీకి అంగీకరించాడు. కేటన్‌‌ను తొలగించడంతో ఆ అవకాశాన్ని ట్రంప్ ఒడిసిపట్టుకున్నాడు. తన అసిస్టెంట్ల ద్వారా టైసన్‌తో సంప్రదింపులు జరిపి.. మేనేజర్‌గా చేరారు. టైసన్ వద్ద ట్రంప్ మేనేజర్‌గా పనిచేసిన విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. ‘మీ దగ్గర ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఏదో ఒకరోజు దేశాధ్యక్షుడు కావచ్చు.. అతనితో జాగ్రత్తగా ఉండాలి’ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.


ఇరువురి మధ్య ఒప్పందాల్లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ చాలా సంవత్సరాలు వ్యాపార భాగస్వాములుగా కొనసాగారు. దీని వల్ల ఇద్దరూ లబ్ది పొందారు. 1992లో అత్యాచారం కేసులో ఇరుక్కుని దోషిగా నిర్దారణ అయిన టైసన్‌కు ట్రంప్ మద్దతు ఇచ్చారు. ఈ కేసు అనంతరం బాక్సింగ్ కొనసాగించాలని టైసన్‌కు సూచించిన అతికొద్ది మంది ప్రముఖుల్లో ట్రంప్ ఒకరు. ఇదే సమయంలో 2016 అధ్యక్ష ఎన్నికలప్పుడు ఇస్లాంను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా.. అప్పటికే ఇస్లాంలోకి మారిన టైసన్ బాసటగా నిలిచాడు. అమెరికా అధ్యక్ష పీఠానికి ఆయన అర్హుడని సమర్ధించారు. ట్రంప్ తనకు మద్దతుగా నిలవడంతోనే అత్యాాచారం కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత తన బాక్సింగ్ కెరీర్ తిరిగి ప్రారంభమైందని పలు సందర్భాల్లో టైసన్ అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com