విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషీ' సినిమా సెప్టెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వెన్నెల కిశోర్ యాక్టింగ్ బాగుంటుందని ప్రశంసించింది. ఆయన యాక్టింగ్‌కు తాను అభిమాని అని, యాక్టింగ్‌కు సంబంధించి చాలా విషయాలు ఆయన నుంచి తెలుసుకున్నానని చెప్పింది. నిర్మాతగా మారి ఆయనతో సినిమా తీయాలని ఉందని పేర్కొంది.