సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై నటి అనూ ఇమ్మాన్యుయేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనదే బహిరంగ రహస్యమే అని అన్నారు. చాలామంది హిరోయిన్ల లాగే.. నాకు కూడా క్యాస్టింగ్ కౌచ్‌కు సంబంధించిన అనుభవాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. అయితే కుటుంబ సభ్యుల సహకారంతో ఇలాంటి లైంగిక వేధింపులను ఎదుర్కొవచ్చని వివరించారు.