నా ట్రస్ట్‌కి ఎవరూ డబ్బులు పంపొద్దు.. నా పిల్లల్ని నేనే చూసుకుంటాను’ అని రిక్వెస్ట్ చేస్తూ కొద్ది రోజుల క్రితం లారెన్స్ రాఘవ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు లారెన్స్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. పొగరుతో అన్న మాటలు అంటూ కామెంట్ చేశారు. దీనిపై లారెన్స్ రాఘవ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో ద్వారా అలా అనడానికి గల కారణాన్ని తెలిపారు. నా ట్రస్ట్‌కి ఎవరూ డబ్బులు పంపొద్దు. నా పిల్లల్ని నేనే చూసుకుంటాను కొద్ది రోజుల క్రితం రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. అందుకు కారణం ఉంది. నేను డాన్స్ మాస్టర్‌గా ఉన్న సమయంలో ట్రస్ట్ ప్రారంభించా. అందులో 60 మంది పిల్లల్ని పెంచటం, వికలాంగులకు డాన్స్ నేర్పించడం, గుండె ఆపరేషన్లు చేయడం, వంటి కార్యక్రమాలు చేశాను. ఆ సమయంలో నా ఒక్కడి వల్లే సాధ్యం కాకపోవడం వల్ల సాయం కోరాను. అప్పుడు రెండేళ్లకు ఒక సినిమా చేసేవాడిని. కానీ ఇప్పుడు సంవత్సరానికి మూడు సినిమాలు చేసి బాగానే సంపాదిస్తున్నా. దాంతో నేనే చేయొచ్చు కదా, ఇతరులను ఇబ్బంది పెట్టడం ఎందుకనిపించింది. నేను పొగరుతో ఇతరులు సేవ కోసం ఇచ్చే డబ్బును వద్దనటం లేదు. నాకు ఇచ్చే డబ్బులు మీకు దగ్గరలో డబ్బుల్లేక కష్టపడే ట్రస్టులు చాలానే ఉన్నాయి. అలాంటి వారికి సాయం చేయండి. వారికి ఆ డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ ట్రస్ట్‌లను ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రారు. నా ట్రస్ట్‌కి చేసే సాయం ఆ ట్రస్ట్‌లకు చేయండి. కొందరైతే నాతో కలిసే సాయం చేస్తామంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో బాధ పడేవారెవరో నేనే చెబుతాను. మీచేత్తో మీరే సాయం చేయండి. అర్థం చేసుకోగలరు’’ అని అన్నారు.