ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఇస్మార్ట్ శంకర్' గోవా కి షిఫ్ట్ అవుతున్నాడు

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 28, 2019, 05:43 PM

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' నిర్మితమవుతోంది. రామ్ హీరోగా చేస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. కొన్నిరోజులుగా హైదరాబాద్ లో జరుగుతోన్న షెడ్యూల్ తాజాగా ముగిసింది. ఈ షెడ్యూల్లో ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

తదుపరి షెడ్యూల్ ను గోవాలో ప్లాన్ చేశారు. నాయకా నాయికల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ .. నభా నటేశ్ కథానాయికలుగా కనిపించనున్నారు. రామ్ మాస్ లుక్ కి మంచి మార్కులు పడిపోవడంతో, ఆయనకి ఈ సినిమా హిట్ తెచ్చిపెట్టడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు వున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa