తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ మరియు సోనియా అగర్వాల్ నటించిన కల్ట్ లవ్ స్టోరీ '7/G రెయిన్బో కాలనీ' సినిమా యొక్క తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 22, 2023న థియేటర్లలోకి గ్రాండ్‌గా తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఇప్పుడు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి ఈ చిత్రాన్ని నైజాం ప్రాంతంలో డిస్ట్రిబ్యూట్ చేయనుందని సమాచారం. ఈ విష్యం గురించి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కల్ట్ ఫిల్మ్‌కి యువన్ శంకర్ రాజా అద్భుతమైన సౌండ్‌ట్రాక్‌లను అందించారు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌పై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు.