ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'మార్క్ ఆంటోని' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందినట్లు సమాచారం.
మార్క్ ఆంటోని సెప్టెంబర్ 15, 2023న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో విశాల్ సరసన రీతూ వర్మ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ఎస్ జె సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మినీ స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు.