షార్ట్ ఫిల్మ్స్, ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం-2 తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి గాయత్రి గుప్తా తన ఆరోగ్యంపై కీలక విషయాలు వెల్లడించారు. తన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని.. ట్రీట్మెంట్ కోసం విరాళాలు సేకరించాలని అనుకుంటున్నట్లు ఓ ఇంటర్య్వూలో చెప్పారు. తన అనారోగ్య సమస్య ఏంటనే వివరాలను మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు.