మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితుడుగా వున్న నవదీప్ కి రేపు అంటే 23న విచారణకి హాజరు కావాలని పోలీసులు నోటీసు ఇచ్చారు. కొన్ని రోజుల క్రితమే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఈ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ పేరును వెల్లడించారు. నవదీప్ డ్రగ్స్ సేవించినట్టుగా వెల్లడించారు. కొంతమంది నైజీరియన్స్ పట్టుకోవటంతో వాళ్ళకి నవదీప్ కి సంబంధాలు వున్నట్టుగా పోలీసులకి తెలిసింది. వాళ్ళ కాల్ డేటా బట్టి ఇవన్నీ తెలుసుకున్నట్టుగా అందుకనే పోలీసులు నవదీప్ ని విచారణకి హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఇవి 41ఎ కింద జారీ చేసినట్టుగా చెపుతున్నారు.