కోలీవుడ్ నటుడు, సంగీత దర్శకుడు అయిన విజయ్ ఆంటోనీ.. తన పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఐతే సోషల్ మీడియా వేదికగా అయన స్పందిస్తూ... ఆయన ఓ లేఖను విడుదల చేశారు. ‘‘నా పెద్ద కుమార్తె గొప్ప హృదయం గల మనిషి. అంతకుమించి ధైర్యవంతురాలు. ప్రస్తుతం తను కులం, మతం, బాధ, అసూయ, పేదరికం, ద్వేషపూరిత వాతావరణంలేని ప్రశాంతమైన చోటుకి వెళ్లిపోయింది. అయినా ఆమె ఇప్పటికీ నాతోనే ఉన్నట్లుంది. తను చనిపోయినప్పుడే.. తనతో పాటూ నేనూ చనిపోయాను. ఇక నుంచి నేను చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఆమె పేరుతోనే ఆరంభిస్తాను’’ అని విజయ్ ఆంటోనీ ఓ ఎమోషనల్ లేఖను ట్వీట్ చేశారు. ఈ లేఖ చూసిన వారంతా.. కన్నీటి పర్యంతమవుతున్నారు.