సాయి పల్లవి , దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి పెళ్లి చేసుకున్నారంటూ కొందరు నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. అయితే, ఆ వార్తలో ఎటువంటి వాస్తవం లేదని తేలింది. నటుడు శివ కార్తికేయన్‌తో కలిసి సాయి పల్లవి ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. రాజ్‌కుమార్ పెరియస్వామి ఆ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మే 9న ‘ఎస్కె21’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర బృందంతోపాటు సాయి పల్లవి, దర్శకుడు మెడలో పూల దండలు వేసుకుని ఫొటో దిగారు. ఇప్పుడు ఆ ఫొటోను షేర్ చేస్తూ ఆమె పెళ్లి అంటూ రూమర్స్ పుట్టించారు. అయితే కొందరు ఆ ఫొటోలు చూసి... సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా తీసుకున్నవి అవి.. చూస్తే అర్థమవుతోంది కదా? పెళ్లి అని, అల ఎలా రూమర్స్ పుట్టిస్తారు? అని మండిపడుతున్నారు.