పేదలకు, అవసరార్ధులకు ఎన్నో రకాలుగా సేవలను అందించిన చిరంజీవి ఛారిటబుల్ (CCT) ట్రస్ట్‌ను ప్రారంభించి 25 వసంతాలు పూర్తయింది. సాధారణ నటుడిగా కెరీర్ ప్రారంభించిన చిరంజీవి తను ఎదిగిన క్రమంలో తోటివారికి తన వంతు సాయం చేయాలనే గొప్ప సంకల్పంతో 1998 అక్టోబర్ 2 చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’ను ప్రారంభించారు. దీనిలో భాగంగా బ్లడ్, ఐ బ్యాంకులను మొదలుపెట్టారు. కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లను సైతం సరఫరా చేశారు. నేటికి ట్రస్ట్ ప్రారంభించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్రస్ట్‌ను ప్రారంభించిన నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు.