గోవా బ్యూటీ ఇలియానా ఇటీవల పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి కాకుండా ఆమె గర్భం దాల్చడం ఏంటని అంతా షాక్ అయ్యారు. చాలా రోజుల వరకూ తన బిడ్డకు తండ్రి ఎవరనేది చెప్పలేదు. ఇటీవల తన ప్రియుడి ఫొటో షేర్ చేసింది. ఇలియానా లైఫ్ పార్ట్నర్ పేరు మైఖేల్ డోలాన్. తన కొడుక్కి కోవా ఫోనిక్స్ డోలాన్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ బిడ్డకు రెండు నెలలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇలియానా తన బిడ్డ క్యూట్ ఫోటో షేర్ చేసింది. ుఅప్పుడే రెండు నెలలు గడచిపోయాయి అని కామెంట్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.