కరోనా మహమ్మారి రావడంతో థియేటర్స్ మూతపడి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ కరువైంది. దీనితో అప్పటి నుంచి ఓటీటీలు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి.ప్రస్తుతం ఓటీటీ ల హవా కొనసాగుతుంది.ఓటీటీ లలో ఎలాంటి భాషా బేధం లేకుండా సినిమాలు విడుదల అవుతున్నాయి. మంచి కంటెంట్ ఉంటే.. ప్రేక్షకులు కూడా వాటిని ఆదరిస్తున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓటీటీ సంస్థలు ఒక భాష చిత్రాలను ఇతర భాష లో కి అనుదిస్తున్నారు. వాటిలో యావరేజ్ టాక్ సినిమాలు మాత్రమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఉంటున్నాయి. ఇక మలయాళ చిత్రాల గురించి ప్రత్యేక్యంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పటికే మాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి 2018, జర్నీ ఆఫ్ 18 ప్లస్, పద్మినీ మరియు ఆర్‌డీఎక్స్ వంటి సినిమాలు ఓటీటీల్లో అదరగొట్టాయి.ఇప్పుడు మరో మలాయళ బ్లాక్ బస్టర్ చిత్రం ఓటీటీలో అదరగొట్టేందుకు వచ్చేసింది. ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమలో విడుదలైన కాసర్ గోల్డ్ మూవీ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా సెప్టెంబర్ 15న థియేటర్లలో విడుదలై భారీగా విజయం సాధించింది.ఓ రాజకీయ నాయకుడు స్మగ్లింగ్ చేయిస్తున్న బంగారం పడిపోవడం.. ఆ బంగారాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి అతని అనుచరులు ప్రయత్నంచడం వంటి కథాంశంతో ఆద్యంతం ఎంగేజింగ్‌గా అలాగే ఎంతో ఎంటర్టైనింగ్‌గా కాసర్ గోల్డ్ సినిమా సాగుతుంది.
మలయాళం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టిన కాసర్ గోల్డ్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.కాసర్ గోల్డ్ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో అక్టోబర్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం మరియు కన్నడ భాషల్లో కాసర్ గోల్డ్ మూవీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులో ఉంది. మృదుల్ నాయర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో జైలర్ ఫేమ్ వినాయకన్ ముఖ్య పాత్ర పోషించాడు. అలాగే దసరా విలన్ షైన్ టామ్ చాకో కూడా ముఖ్య పాత్ర చేశాడు. యూడ్లీ ఫిల్మ్స్ బ్యానర్‌పై విక్రమ్ మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ నిర్మించారు.కాసర్ గోల్డ్ సినిమాలో అసీఫ్ అలీ, సన్నివేలన్, సిద్ధిఖీ, సంపత్ రామ్ మరియు దీపక్ పారంబోల్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. విష్ణు విజయ్ ఈnసినిమాకు సంగీతం అందించారు. రాజకీయ నాయకుడు స్మగ్లింగ్ చేయాలనుకున్న బంగారం దొంగతనం కావడం.. ఫైజల్ గ్యాంగ్ వెంట అతని అనుచరులు పడటం వంటి ట్విస్టులతో కాసర్ గోల్డ్ సినిమా సాగుతుంది.. అలాగే యూత్ ని ఆకట్టుకునే ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్, లవ్ రొమాన్స్ అన్ని అంశాలతో కాసర్ గోల్డ్ సినిమా తెరకెక్కింది.ఈ వీకెండ్ ఓటీటీ ప్రేక్షకులకు కాసర్ గోల్డ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.