యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ కూడా హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. అయితే సరైన హిట్ మాత్రం తన ఖాతాలో పడలేదు. చాలా కాలంగా ఐశ్వర్య.. లెజెండరీ నటుడు తంబి రామయ్య కొడుకు ఉమాపతితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారట. త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.