టాలీవుడ్ ప్రేమ జంట మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీలు నేడు ఒకటి కాబోతున్నారు. ఇటలీలో ఈ రోజు మధ్యాహ్నం 2.48 గంటలకు వీరి పెళ్లి జరగనుంది. అనంతరం రాత్రి 8.30 గంటలకు వెడ్డింగ్ రిసెప్షన్ ను నిర్వహించనున్నారు. ఈ పెళ్లి వేడుకకు ఇప్పటికే మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠీ కుటుంబం, స్నేహితులు కలిపి మొత్తం 120 మంది ఇటలీకి వెళ్లారు.