టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వైవాహిక బంధంలో అడుగు పెట్టారు. నవంబర్ 1న ఇటలీలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఎంతో ఘనంగా జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన మరో వార్త వైరల్గా మారింది. అదేంటంటే.. పెళ్లికి మెగా ఫ్యామిలీ భారీగానే ఖర్చు చేసిందని.పెళ్లి కోసం ఏకంగా రూ.15-17 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. కాగా, నవంబర్ 5న హైదరాబాద్లో రిసెప్షన్ జరగనుంది.