మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నవంబర్ 1న వీరి వివాహం ఇటలీలో అంగరంగా వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాలతోపాటు బంధువులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు తెలుపుతూ అల్లు అర్జున్ తన ఫ్యామిలీ ఫోటోను ట్విటర్ లో షేర్ చేశారు. తన సతీమణి స్నేహారెడ్డి, కుమారుడు అయాన్, కూతురు అర్హతో కలిసి దిగిన ఫోటో ఆకట్టుకుంటుంది.