కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో లైకా ప్రొడక్షన్స్ తో పాటు రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఇండియన్ 2’ . వీరిద్దరి కాంబినేషన్లో 1996లో విడుదలైన బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ‘ఇండియన్’ సినిమాకు ఇది సీక్వెల్. శంకర్ సినిమా మేకింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతీ విషయాన్ని ఆయన ఓ బ్రహ్మాండంగా చూపిస్తారు. అలాంటి ఓ డైరెక్టర్‌కి లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ వంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ దొరికితే ఎలా ఉంటుందనేది ‘ఇండియన్ 2’ సినిమాతో ప్రూవ్ కానుంది. అభిమానులు, సినీ ప్రేమికులు, ట్రేడ్ వర్గాలు ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 3న ‘ఇండియన్ 2’ ఇంట్రో గ్లింప్స్‌ను విడుదల చేయటానికి మేకర్స్ సిద్ధమయ్యారు.