టాలీవుడ్ హీరో శర్వానంద్- రక్షిత దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది జూన్ 3న ఘనంగా రక్షిత, శర్వానంద్ ల వివాహం జరిగిన విషయం తెలిసిందే. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న రక్షిత, అక్కడే డెలివరీ చేయించుకొనున్నట్లు తెలుస్తుంది. ఈ శుభవార్తతో కొన్నిరోజులు షూటింగులకు కూడా శర్వానంద్ బ్రేక్ ఇచ్చారు.