భారత క్రికెట్ జట్టులో ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ ఒక సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మొదటి నాలుగు మ్యాచ్ లలో ఆడకపోయినా, తరువాత అతనికి చాన్సు వచ్చింది, అప్పుడు తన సత్తా ఏంటో చూపించాడు. నాలుగు మ్యాచుల్లో మొత్తం 16 వికెట్లు పడగొట్టడమే కాకుండా, వరల్డ్ కప్ లో ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్ గా తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇంతకు ముందు వున్న ఫాస్ట్ బౌలర్లు జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్ లను షమీ ఇప్పుడు దాటిపోయాడు. మొత్తం వరల్డ్ కప్ మ్యాచులలో 45 వికెట్లు తీసుకున్నాడు. ఇతను కేవలం 14 మ్యాచులు ఆది ఈ 45 వికెట్లు తీసుకున్నాడు. ఇంతకు ముందు 44 వికెట్లు తీసుకొని జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్ లు అగ్రస్థానంలో ఉండేవారు. ఇక క్రికెట్ ని పక్కన పెడితే, మహమ్మద్ షమీ కి పెళ్లి చేసుకుంటాను అని ఒక బాలీవుడ్ నటి 'ఎక్స్' (ఇంతకు ముందు ట్విట్టర్) లో పోస్ట్ పెట్టింది. అయితే ఒక షరతు కూడా పెట్టింది ఆ నటి. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా, తెలుగు సినిమా 'ప్రయాణం' లో మంచు మనోజ్ పక్కన నటించి సినిమా అరగేంట్రం చేసిన పాయల్ ఘోష్. ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు చేసింది పాయల్ ఘోష్. ఇప్పుడు రాజకీయ నాయకురాలు కూడా ఆమె. ఆమె 'ఎక్స్' లో షమీ ని పెళ్లి చేసుకుంటాను అని ఒక పోస్ట్ పెట్టి, షరతు కూడా పెట్టింది. అదేంటి అంటే, నువ్వు ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని. అయితే ఈ పోస్ట్ కి షమీ ఇంకా ఎటువంటి సమాధానం చెప్పలేదు. షమీ హసిన్ జహాన్ అనే ఆమెని వివాహం చేసుకున్నాడు, కానీ వారిద్దరి మధ్య కొంచెం వైషమ్యాలు రావటంతో వారిద్దరూ ఇప్పుడు న్యాయపరంగా విడిపోవడానికి చూస్తున్నారు. ఇటువంటి సమయంలో పాయల్ ఘోష్ ఈ పోస్ట్ పెట్టి ఒక సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. దీని మీద నెటిజన్స్ విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు.