వరుస పరాజయాలతో సతమవుతున్న హీరో సాయిధరమ్ తేజ్ నుండి రాబోతున్న చిత్రం 'చిత్రలహరి'. ఈ సినిమా ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని మెగా హీరో నమ్ముతున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ లోగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి మైత్రీ మూవీ మేకర్స్ వారు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరుకానున్నట్టుగా తెలుస్తోంది. 'జనతా గ్యారేజ్' సమయం నుంచి మైత్రీ మూవీ మేకర్స్ వారికి ఎన్టీఆర్ తో మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన వాళ్ల ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ రానున్నాడని అంటున్నారు. వాస్తవానికి ఈ వేడుకకి చిరంజీవిగానీ .. చరణ్ గాని ముఖ్య అతిథులుగా రావలసి ఉందట. అయితే ఏపీ ఎన్నికల్లో 'జనసేన' పోటీ చేస్తుండటంతో, మీడియాకి దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్లు రావడం లేదని చెప్పుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa