cinema | Suryaa Desk | Published :
Wed, Mar 27, 2019, 01:08 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి రాబోతున్న చిత్రం 'మహర్షి'. పోయిన సంవత్సరం 'భరత్ అనే నేను' సినిమాతో బాక్స్ ఆఫీస్ ను దున్నేశాడు. ఈ సారి కూడా మహర్షి తో రికార్డులు కొల్లగొట్టాలని ఆశిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదలడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నెల 29న ఉదయం 9 గంటల 9 నిమిషాలకి ఫస్టు సింగిల్ గా 'చోటి .. చోటి' అంటూ సాగే సాంగ్ ను వదలనున్నారు. ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీ యూత్ ను ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు. మహేశ్ బాబు .. 'అల్లరి' నరేశ్ .. పూజా హెగ్డే పై ఈ పాటను చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. మొదటి సాంగ్ తో ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు పెరుగుతాయో చూడాలి మరి.మే 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa