ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సూపర్ డీలక్స్' సినిమా రన్ టైం చాల ఎక్కువ గా ఉందట

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2019, 04:34 PM

త్యాగరాజన్ కుమార రాజా దర్శకత్వంలో విజయ్ సేతుపతి,సమంత ,రమ్యకృష్ణ , ఫహద్ ఫాజిల్ , మిస్కిన్ ముఖ్య పాత్రల్లో నటించిన తాజా చిత్రం సూపర్ డీలక్స్. కాగా ఈచిత్రంలో విజయ్ సేతుపతి లేడీ గెటప్ లో కనిపించనుండగా రమ్యకృష్ణన్ శృంగార తార గా నటించింది. ఇక ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని విడుదల సిద్ధమైంది. ఏ సర్టిఫికెట్ తో రానున్న ఈ చిత్రం యొక్క నిడివి 2గంటల 55 నిమిషాలని సమాచారం.


డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈచిత్రం మార్చి 29 న విడుదలకానుంది. ఇక ఈ సినిమా అదే రోజున తెలుగులోనూ విడుదలకానుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సివుంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa