బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్'. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా గా కనిపిస్తారని రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో వెల్లడించారు రాజమౌళి గారు. ఈ సినిమా షూటింగ్ త్వరత్వరగా జరిగిపోతుంది. ఇక తదుపరి షెడ్యూల్ ను నార్త్ ఇండియాలో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో కథానాయికలు కూడా పాల్గొననున్నారని అంటున్నారు.
ఈ సినిమాలో చరణ్ జోడీగా ఆలియా భట్ ను .. ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గార్ జోన్స్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కూడా నార్త్ ఇండియాలో ప్లాన్ చేసిన షూటింగులో జాయిన్ కానున్నారని చెబుతున్నారు. ఇక ముఖ్యమైన పాత్రల కోసం అజయ్ దేవగణ్ ను .. సముద్రఖనిని తీసుకోగా .. ఇతర పాత్రల కోసం మరికొంతమంది స్టార్ల పేర్లు వినిపిస్తున్నాయి. 2020 జూలై 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.