శైలేష్ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ హీరో వెంకటేష్ తన 75వ సినిమాని అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'సైంధవ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా జనవరి 13, 2024న థియేటర్‌లలో విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసారు.
సైంధవ్ ట్రైలర్ చాలా హింసాత్మకంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో వెంకటేష్ మాట్లాడుతూ సినిమాలో అనవసరమైన యాక్షన్ సన్నివేశాలు ఉండవని అన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు శైలేష్ కొలను ఇదే విషయం గురించి మాట్లాడాడు. సైంధవ్‌లో హింస కంటే చాలా ఎక్కువ ఉందని పేర్కొన్నాడు.
శైలేష్ మాట్లాడుతూ... అవును, సైంధవ్‌లో హింసాత్మక క్షణాలు ఉన్నాయి. కానీ మీరు హింసను తీసివేసినప్పటికీ ప్రభావం కొంచెం కూడా మారదు. హిట్ 2లో కూడా క్లైమాక్స్‌లో మాత్రమే హింస ఉంటుంది. సెన్సార్ బోర్డ్ కొన్ని సన్నివేశాలను బ్లర్ చేయమని అడిగినా సరే అని చెప్పాను నిజాయితీగా నేను పట్టించుకోను. అంతేకాకుండా, ఈ సినిమాని చాలా మంది ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నాను. ఇందులో సామాజిక కోణం కూడా ఉంది. ఈ సినిమాలో వెంకీ సర్ చేసే కొన్ని అంశాలు వారికి నేరుగా కమ్యూనికేట్ చేయడం వల్ల ఎక్కువ మంది పిల్లలు ఈ చిత్రాన్ని చూడాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తుంది. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ లో బేబీ సారా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్, రుహాని శర్మ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.