నటి నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘ఎల్ఐసీ’ (లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్). ఈ సినిమా టైటిల్ విషయంలో విఘ్నేశ్ శివన్కు చిక్కులు తప్పడం లేదు. ఎల్ఐసీ సంస్థ చిత్రబృందానికి నోటీసులు జారీ చేసింది. తమ సంస్థకు ప్రజల్లో మంచి పేరు ఉందని.. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. ఎనిమిదేళ్ల క్రితమే ఈ టైటిల్ ను రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని కుమారన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.