త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా జనవరి 12, 2024న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గుంటూరు కారంలో మహేష్ బాబు ఎంట్రీ సన్నివేశంపై సోషల్ మీడియాలో ఊహాగానాలు ఉన్నాయి. ఎరుపు థార్ జీప్‌తో మహేష్ బాబు ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రాహుల్ రవీంద్రన్, రమ్యకృష్ణ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa