అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం మజిలీ. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం, తన కొడుకు, కోడలు నటనకు ఫిదా అయినట్టు నాగ్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించారు. మజిలీ చిత్రంలో నాగచైతన్య, సమంత తిరుగులేని నటన కనబర్చారని అభినందించారు. వారి నటన పట్ల గర్విస్తున్నానని, రావు రమేశ్, పోసాని కూడా ఆకట్టుకున్నారని నాగ్ ట్వీట్ చేశారు. అంతేకాదు, మజిలీ చిత్రబృందానికి 'ఆల్ ద బెస్ట్' చెప్పారు. పెళ్లయిన తర్వాత చైతూ, సామ్ జంటగా నటించిన చిత్రం ఇదే. దాంతో సినిమా విడుదలకు ముందే భారీ హైప్ సొంతం చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa