రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా కీలక పాత్రధారులుగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా ‘యానిమల్’. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పలు వివాదాల వల్ల ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కు క్లియరెన్స్ రాలేదు. తాజాగా వివాదాలు ఓ కొలిక్కి రావడంతో ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ అభిమానులకు శుభావార్త చెప్పింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీ నుంచి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే మూవీ చూసిన వారికి మరింత సర్‌ప్రైజ్ జోడించి ఓటీటీ వెర్షన్ అందించనున్నారు. దాదాపు 8 నిమిషాల అదనపు నిడివితో ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. థియేటర్ వెర్షనలో లేని పలు సన్నివేశాలను ఇందులో చూసే అవకాశం కల్పించారు. సినిమా రన్ టైమ్ 3 గంటల 21 నిమిషాలు కాగా, ఓటీటీ కోసం అదనపు సన్నివేశాల జోడించడంతో దాదాపు మూడున్నర గంటలతో ‘యానిమల్’ స్ర్టీమింగ్ కానుంది.