ఎఫ్ 2 తరువాత వెంకటేష్... నాగచైతన్య కలిసి చేస్తున్న సినిమా వెంకిమామ. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా ప్రారంభమైంది. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా వెంకిమామ సినిమాలోని ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. వెంకటేష్ భుజంపై నాగచైతన్య చేయివేసి కూర్చొని ఉంటాడు. పల్లెటూరిలో షూట్ చేసిన ఈ ఫోటో అందరిని ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వెంకటేష్ కు జోడిగా పాయల్ నటిస్తుంటే.. నాగచైతన్యకు జోడిగా రాశి ఖన్నా చేస్తోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa