చాలా కాలం తర్వాత టాలీవుడ్ మన్మథుడి ఖాతాలో హిట్టు పడింది. ఘోస్ట్ మూవీ తర్వాత అక్కినేని నాగార్జున నటించిన 'నా సామిరంగ'.విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ఈసారి పండక్కి ఫ్యామిలీ అడియన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ అందించాడు. విలేజ్ మాస్ డ్రామాగా వచ్చిన ఈ మూవీతో మరోసారి నాగ్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. కామెడీ, మాస్, లవ్ స్టోరీ ఇలా అన్ని అంశాల్లోనూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించింది ఈ . దీంతో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమిండ్ డేట్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫిల్మ్ లవర్స్. అయితే వారికో గుడ్ న్యూస్. కొద్దిరోజులుగా నా సామిరంగ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యిందంటూ వినిపిస్తున్నాయి. కానీ ఏరోజు అనేది మాత్రం క్లారిటీ రాలేదు. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా టాక్.
లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ ను వచ్చే ఫిబ్రవరి 15 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. అయితే దీనిపై ఇప్పటి వరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇక నా సామి రంగ .. కంటెంట్తో పాటు మ్యూజిక్ పరంగానూ ఆకట్టుకుంటుంది. విడుదలకు ముందే ఈ మూవీలోని సాంగ్స్ యూట్యూబ్ లో సూపర్ డూపర్ హిట్టయ్యాయి. ఈచిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. మలయాళీ కు రీమేక్ చేసినా.. తెలుగు నెటివిటికి తగినట్లుగా ఈ మూవీని మార్చి రూపొందించి.. మంచి హిట్టు కొట్టారు