OTT ప్లాట్‌ఫారమ్‌లలో రిలీజ్ అయ్యిన "భామాకాలం" చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను ఆకర్షించిన ప్రియమణి ఇప్పుడు దాని సీక్వెల్ "భామాకలాపం 2" తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేయగా ఈ సినిమాపై టీజర్ భారీ హైప్ ని క్రియేట్ చేసింది.
తాజాగా ఇప్పుడు, ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో 2 మిలియన్ వ్యూస్ ని సాధించినట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త వీడియోని పోస్ట్ చేసి ప్రకటించింది. ఈ చిత్రం ఆహా వీడియోలో ఫిబ్రవరి 16, 2024న విడుదల కానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
క్రైమ్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో సీరత్ కపూర్, బ్రహ్మాజీ మరియు శరణ్య కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి అభిమన్యు దర్శకత్వం వహించగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. విప్లవ్ నిషాదం ఎడిటర్‌గా, కిరణ్ మామిడి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.