ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరణించారన్న వార్త ప్రతి ఒక్కర్ని షాక్‌కు గురి చేసింది. పైగా సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయిందని ప్రకటించడం మరింత కలచివేసింది.సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా ఆమె ఫొటోలు, వీడియోలే తెగ కనపడుతున్నాయి. ఆమె మృతి వార్త బయటకు రావడంతో అందరూ RIP పోస్ట్‌లు పెడుతున్నారు. కొందరు మాత్రం ఆమె మరణవార్తపై సందేహాలు వ్యక్తం చేశారు. ఎప్పుడూ వివాదాల కోరుకునే పూనమ్.. బ్లఫ్ చేస్తోందని భావించారు.
అదే నిజమైంది. చనిపోయారంటూ వార్త వచ్చిన మరుసటి రోజే పూనమ్ ప్రత్యక్షమ్వడం నిజంగా అందరినీ విస్మయానికి గురిచేసింది. తాను చనిపోలేదని.. బ్రతికే ఉన్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేసింది. దురదృష్టవశాత్తు, సర్వైకల్ క్యాన్సర్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.. దీంతో సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకే చనిపోయినట్టు నటించానంటూ పూనమ్ పాండే రిలీజ్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చింది. ' గర్భాశయ క్యాన్సర్ వల్ల వేలాది మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాదు. దీనిని నిర్మూలించడం సాధ్యమే. HPV వ్యాక్సిన్ లేదా ముందస్తుగా గుర్తించడం అవసరం. ఈ మహమ్మారితో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా ఉండే మార్గాలు ఉన్నాయి. దీనిపై అవగాహన కల్పిద్దాం' అని ఆమె పేర్కొంది.