భారతదేశంలో ఎన్నో మతాలు, కులాల వాళ్లు.. ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా కలిసి మెలిసి ఆనందంగా జీవిస్తున్నారు. కానీ కొందరు స్వార్థ రాజకీయాలతో మనలో మనకు గొడవలు పెట్టారు. దీని వల్ల నష్టం జరిగింది. అయితే ఇలాంటి చెడు పరిమాణాల నుంచి ప్రజలను, దేశాలను కాపాడిన వారెందరో ఉన్నారు. అలాంటి ఓ హీరో మొయిద్దీన్ భాయ్. మొయిద్దీన్ భాయ్ పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం ‘లాల్ సలామ్’ . ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో సుభాస్కరణ్ నిర్మించారు. ఫిబ్రవరి 9న పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ లక్ష్మీ మూవీస్ గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘ఊర్లో ఒక్క మగాడు లేడా? ఊర్లో ఉన్నొళ్లందరినీ తీసుకెళ్లి బొక్కలే వేశారు’ అనే డైలాగ్‌తో ఇంటెన్స్ యాక్షన్‌తో ట్రైలర్ మొదలైంది. ఆ తరువాత ఊరి వాతావరణం, క్రికెట్ ఆట, జాతర సీన్లు, రాజకీయంతో ముడిపడ్డ సన్నివేశాలను చూపించారు. ‘మందిని కూడ బెట్టేవాడి కన్నా.. ఎవడి వెనకాల మంది ఉంటారో వాడే చాలా ప్రమాదకరం.. వాడ్ని ప్రాణాలతో వదిల పెట్టకూడదు’ అనే డైలాగ్ అనంతరం.. తలైవా రజనీకాంత్ ఎంట్రీ ట్రైలర్ రేంజ్‌ని మార్చేసింది. ‘బిడ్డ సంపాదిస్తే ఇంటికి గౌరవం.. బిడ్డ సాధిస్తే దేశానికే గౌరవం’, ‘మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో.. మానవత్వాన్ని అందరితో పంచుకో.. ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే’ అని తలైవా రజినీకాంత్ చెప్పే డైలాగ్స్ సినిమాపై అంచనాలను రేకెత్తిస్తున్నాయి.