‘నేను వెయ్యి ఆడిషన్స్ ఇవ్వాల్సి వచ్చేదేమో, కానీ వాటికి ముగింపు పలికింది ‘రామన్ రాఘవ్ 2.0’ ఆడిషన్స్’ అని కథానాయిక శోభితా ధూళిపాళ తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ’సినీ పరిశ్రమలో రాణించాలంటే సృజనాత్మక వ్యక్తీకరణ ఉంటే సరిపోతుందేమో అనుకున్నాను. నేను క్లాసికల్ డ్యాన్సర్‌ని కాబట్టి అది నాకు సులువే. ఇప్పటి వరకూ నటనకు ప్రాధాన్యం ఉండే ఏ అవకాశం వదులుకోలేదు. అలాంటి వాటినే ఇష్టపడతాను’ అని శోభిత చెప్పారు.