ఇంటర్నెట్ వినియోగదార్లలో 86% మంది ఓటీటీ సేవలను ఆస్వాదిస్తున్నారని ఇంటర్నెట్ అనలిటిక్స్ కంపెనీ కాంటార్ నివేదికలో వెల్లడించింది. ఇందులో 53% గ్రామీణులే ఉన్నారని పేర్కొంది.
దేశంలో అధిక శాతం ఇంటర్నెట్ వినియోగం వీటితోనే జరుగుతోందని తెలిపింది. వీడియో కంటెంట్‌ను అధికంగా ఇంటర్నెట్-ఓన్లీ పరికరాల (20.8 కోట్ల మంది) ద్వారా చూస్తున్నారని, సంప్రదాయ లీనియర్ టీవీ ద్వారా 18.1 కోట్ల మంది వీక్షిస్తున్నారని వివరించింది.