ఫిల్మ్ నగర్ లో టాలీవుడ్ హాట్ న్యూస్ ఒకటి హల్ చల్ చేస్తోంది. పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా పూజాదికాలు పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభిరామ్ నిలిచాడు. అభిరామ్ ను ఈ సినిమాలో నటింపజేయనున్నట్టు తెలుస్తోంది. తారక్ సినిమా షూటింగ్స్ లో సందడి చేసే అభిరామ్ ప్రత్యేక పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది. అయితే దీనిపై జూనియర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ వార్త వాస్తవమైతే త్రివిక్రమ్ సినిమాలో తొలిసారి జూనియర్ ఎన్టీఆర్, అభిరామ్ నటించినట్టవుతుంది. కాగా, ఈమధ్యే విడుదలైన 'రాజా ది గ్రేట్' సినిమాలో రవితేజ కుమారుడు మహాధన్ వెండితెరకు పరిచయమై మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa